సుభాష్‌నగర్: ఐదేళ్లలోపు పిల్లలందరికీ పల్స్ పోలి యో చుక్కలు తప్పనిసరి అని కార్యక్రమ రాష్ట్ర పరిశీలకులు వెంకటరమణ అన్నారు. నగరంలోని వినాయక్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని మురికివాడల్లో సోమవారం పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలను చిన్నారులకు అందజేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు. ఈమేరకు పంపిణీని ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. పట్టణారోగ్య కేంద్ర వైద్యాధికారి అనిల్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి అశోక్, డీహెచ్‌ఈలు వేణుగోపాల్, వెంకటేశ్వర్లు, హెచ్‌ఈవోలు వెంకట్ రవి, వినోద్, ఆశాకార్యకర్తలు, నర్సింగ్ వలంటీర్లు ఉన్నారు.
99శాతం పల్స్‌పోలియో..
పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా రెండోరోజు 11,282 మంది చిన్నారులకు 9,264 మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్లు డీఎంహె చ్‌వో రాజశ్రీ తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారులు 1,91,883 మంది ఉండగా ఆది, సోమవారాల్లో 1,88,760 (99శాతం) మందికి పోలియో చుక్కలు వేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన ఒక శాతా న్ని మూడోరోజు పోలియోచుక్కలు వేసి విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.


