వేల్పూర్: వేల్పూర్ మండలంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షం పంటలకు ఊరటనిచ్చింది. మండలంలో 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నీరందక వాడిపోతున్న దశలో ఉన్న మొక్కజొన్న, పసుపు, సోయాబిన్ పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది. మండలంలోని వివిధ గ్రామాల్లో ఖరీఫ్ సీజన్‌లో మెట్ట భూములతోపాటు బోరుబావుల కింద పసుపు, మొక్కజొన్న, సోయాబిన్ పంటలు సాగుచేస్తున్నారు. వర్షాలు లేక బోరుబావుల్లో సైతం నీటి నిల్వలు తగ్గిపోయి. సాగునీరందక రైతులు నిత్యం ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో కురిసిన భారీ వర్షం రైతుల్లో సంతోషం నింపింది.


