● డీఆర్డీవో సాయన్న
డిచ్‌పల్లి: స్వయం సహాయక సంఘాలలో సభ్యులైన ప్రతి మహిళా ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని డీఆర్డీవో సాయన్న తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో జిల్లాలోని పది మండలాలకు చెందిన ఐకేపీ సీఆర్‌పీలకు ఆర్థిక అక్షరాస్యతపై నిర్వహించే ఆరు రోజుల శిక్షణ తరగతులను సోమవారం డీఆర్డీవో ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో మహిళలు డబ్బులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం, కుటుంబ పోషణ, పిల్లల చదువులు తదితర అంశాలపై శిక్షణలో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఐకేపీ డీపీఎం సంధ్యారాణి, ఆర్‌ఎస్‌ఈటీ డైరెక్టర్ రవికుమార్, సిబ్బంది రామకృష్ణ, భాగ్యలక్ష్మి, నవీన్, లక్ష్మీనారాయణ, సీఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.


