● ఎన్‌డీసీసీబీ జనరల్ మేనేజర్ అనుపమ
సుభాష్‌నగర్ : గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమం, మహిళా సాధికారతలో సహకార సంఘం పాత్ర ఎంతో కీలకమని ఎన్‌డీసీసీబీ జనరల్ మేనేజర్ అనుపమ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని ఎన్‌డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార పతాకాన్ని ఆమె ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బ్యాంకు సిబ్బందితో కలిసి బ్యాంకు సేవలు, సహకార రంగం విశిష్టతను ప్లకార్డులు ప్రదర్శిస్తూ నగరంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం సహకార శాఖను ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. సహకారమే సమృద్ధి అను నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. సహకార సంఘాలు, సహకార బ్యాంకులు గ్రామీణాభివృద్ధికి జీవనాడులని కొనియాడారు. ఐదేళ్లలో సహకార వ్యవస్థ విజయాలను స్ఫూర్తిగా తీసుకొని మరింత మెరుగైన సేవలు అందించేందు కు ప్రతి సహకార వాది కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు ఉప జనరల్ మేనేజర్లు శ్రీధర్‌రెడ్డి, సుమమాల, లింబాద్రి, సహాయ జనరల్ మేనేజర్లు గజానంద్, శ్రీధర్, సుమన్, అజయ్ రెడ్డి, భీమ్‌రావు, డీసీవో శ్రీనివాస్‌రావు, నాబార్డు డీడీఎం ప్రవీణ్‌కుమార్, కార్యాలయ సిబ్బంది, సహకార సంఘాల సిబ్బంది పాల్గొన్నారు.


