సుభాష్‌నగర్ : టీజీఎన్‌పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ పరిధిలో ఇద్దరు ఏఈలకు ఏడీఈలుగా పదోన్నతులు కల్పిస్తూ కంపెనీ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ డివిజన్ కార్యాలయంలో కమర్షియల్ ఏఈగా పని చేస్తున్న రాజేందర్‌రెడ్డి, డీ–7 సెక్షన్‌లో ఆపరేషన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న బాబా శ్రీనివాస్‌కు ఏడీఈలుగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగులు ఇచ్చారు. రాజేందర్‌రెడ్డికి భీంగల్ ఆపరేషన్ విభాగంలో ఏడీఈగా, బాబా శ్రీనివాస్‌కు డీపీఈలో ఏడీఈగా పోస్టింగ్ ఇచ్చారు. వారు త్వరలోనే విధుల్లో చేరనున్నారు.
నిజామాబాద్ అర్బన్ : పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. ట్రాఫిక్‌లో పనిచేస్తున్న జీ లింగం, రుద్రూరు పోలీస్‌స్టేషన్‌లో చేస్తున్న శివకుమార్‌గౌడ్‌లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. వీరిని సోమవారం సీపీ తన కార్యాలయంలో అభినందించారు.
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రభుత్వ బడుల బలోపే తం కోసం గ్రామాలు చైతన్యం అవుతున్నాయి. సోమవారం మారంపల్లికి వచ్చిన ప్రయివేటు పాఠశాల బస్సులను అడ్డుకున్నారు. ప్రయివేటు పాఠశాలలకు పంపుతున్న విద్యార్థులను బస్సుల్లోంచి దింపేసి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. సర్పంచ్ గంగాధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్, వీడీసీ పెద్దలు కలిసి పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారితో మాట్లాడారు. ప్రభుత్వ బడిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలకే పంపాలని కోరారు. ప్రయివేటు యాజమాన్యాలు కూడా సహకరించాలని సూచించారు.


