కామారెడ్డి అర్బన్: జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారిణి ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని మణికొండ ఆదిరా బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2026 పోటీల్లో కామారెడ్డికి చెందిన ఆరాధ్యరెడ్డి విజేతగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఆరాధ్యరెడ్డి అండర్–19 బాలికల డబుల్స్ విభాగంలో బంగారు, మిక్స్‌డ్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచి వెండి పతకం సాధించినట్లు కామారెడ్డి ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే సందీప్ గౌడ్ తెలిపారు. 48వ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (సౌత్‌జోన్) పోటీల్లోనూ ఆరాధ్యరెడ్డి విజేతగా నిలిచి జిల్లా క్రీడాకారులకు స్ఫూర్తిగా ఉండాలని క్రీడాకారులు, అభిమానులు అభినందించారు.


