సూక్ష్మసేద్యంపై చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

సూక్ష్మసేద్యంపై చిన్నచూపు

Jun 29 2026 1:35 AM | Updated on Jun 29 2026 1:35 AM

6 వేల హెక్టార్లకు ఇచ్చింది 62 హెక్టార్లే..

దరఖాస్తు చేసుకున్న వారికి డ్రిప్‌ అందించాలి

అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులు కొండంత.. నిధులు గోరంత

డ్రిప్‌ పరికరాల కోసం రైతులకు ప్రోత్సాహం కరువు

ఇందల్వాయి : రైతులు ఆరుతడి పంటలు సాగు చే యాలని ప్రభుత్వం సూచిస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు తగిన విధంగా కార్యాచరణ అమలుచేయడం లేదని వ్యవసాయరంగ నిపుణులు, రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం సూక్ష్మ సేద్య ప్రాజెక్టు ద్వారా 80 శాతం నుంచి రాయితీపై అందించాల్సిన సూక్ష్మ బిందుసేద్యం పరికరాలకు తగినన్ని నిధులు మంజూరు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.

ఆరుతడికి ప్రోత్సాహం కీలకం

ఎల్‌నినో మూలంగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వరి సాగును తగ్గించి ఆరుతడి పంటలైన సోయాబీన్‌, మొక్కజొ న్న, కందులు, అపరాల సాగు వైపు రైతులను మ ళ్లించాల్సిన ఆవసరం ఎంతో ఉందని కేంద్ర వ్యవ సాయ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన మండలి సంయుక్తంగా స్పష్టం చేసి జిల్లాల వారీగా కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు డ్రిప్‌ పరికరాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆయిల్‌ పామ్‌కే అధిక ప్రాధాన్యం

మంజూరైన కొద్దిపాటి నిధులను ఆరుతడి పంటలకు కాకుండా ఆయిల్‌పామ్‌ తోటలకు కేటాయించడంతో ఆరుతడి పండించే రైతులకు ప్రతీసారి నిరీక్షణ తప్పడం లేదు. అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసి ఆయిల్‌ పామ్‌తోపాటు ఆరుతడి పంటలకు కూడా జాప్యం లేకుండా డ్రిప్‌ పరికరాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

జిల్లాలో గతేడాది సుమారు 6,476 హెక్టార్లలో సూక్ష్మ బిందుసేద్యం లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 62.74 హెక్టార్లకే డ్రిప్‌ పరికరాలను అందించారు. సుమారు రూ.30 కోట్ల వరకు నిధులు అవసరం కాగా.. కేవలం రూ.6 కోట్ల వరకే నిధులు మంజూరైనట్లు ఉద్యాన అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం 2,600 ఎకరాలకు డ్రిప్‌ పరికరాలు అందించడం లక్ష్యమని అన్నారు.

ఆరుతడి, ఆయిల్‌పామ్‌ తేడా లేకుండా దరఖాస్తు చేసు కున్న ప్రతి రైతుకు బిందుసేద్యం పరికరాలు అందించాలి. ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభు త్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. అధికారుల నివేదిక ప్రకారం నిధులు విడుదల చేయాలి.

– పాట్కూరి తిరుపతిరెడ్డి, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు

డ్రిప్‌ పరికరాలు అవసరమై రైతులు తమకు నచ్చిన కంపెనీని ఎంచుకొని మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, ఐదు ఎకరాలకు తక్కువగా ఉన్న రైతులకు 80 శాతం, ఐదు ఎకరాలకు పైన ఉన్న రైతులకు 70 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. ఈ సంవత్సరం సుమారు 2,600 ఎకరాలకు డ్రిప్‌ అందించడమే లక్ష్యంగా ఉద్యానశాఖ కార్యాచరణ రూపొందించింది. – జయ, డీడీ, జిల్లా ఉద్యానశాఖ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement