సుభాష్‌నగర్: ప్రజల సహకారంతో పోలియో రహిత సమాజాన్ని నిర్మిస్తామని జిల్లా వైద్యారో గ్యశాఖాధికారిణి రాజశ్రీ అన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రంలో అదనపు కలెక్టర్ భుజంగరావు ప్రారంభించారు. పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో డీఎంహెచ్‌వోతోపాటు మేయర్ కూరగాయల ఉమారాణి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 94 శాతం మందికి చుక్కల మందు వేశారు. మిగిలిపోయిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో మందు వేస్తారు. నగరంతోపాటు గ్రామాలు, ప్రధాన బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్, రద్దీప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 1,91,883 మంది ఉండగా మొదటిరోజు 1,80,601 (94శాతం) మందికి పోలియో చుక్కలు అందించామని డీఎంహెచ్‌వో తెలిపారు. మిగిలినవారిని వైద్యారోగ్య సిబ్బంది గుర్తించి చుక్కల మందు వేస్తారన్నారు. డీఐవో అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సికిందర్ నాయక్, డీహెచ్‌ఈలు, హెచ్‌ఈవోలు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
1,80,601 మంది చిన్నారులకు
మందు వేసిన వైద్యసిబ్బంది
సోమ, మంగళవారాల్లో
మిగిలిపోయిన వారికి..
పోలియోరహిత సమాజాన్ని నిర్మిస్తాం : డీఎంహెచ్‌వో రాజశ్రీ


