దంచికొట్టిన వాన | - | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన వాన

Jun 29 2026 1:35 AM | Updated on Jun 29 2026 1:35 AM

పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి

జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ఎడపల్లిలో 72.8 మి.మీ.

వర్షపాతం నమోదు

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి విస్తారంగా వర్షం కురిసింది. సీజన్‌ ప్రారంభమైన తరువాత ఇదే భారీ వర్షం. రైతులు ఆందోళన చెందుతున్న వేళ కురిసిన భారీ వర్షం ఊరటనిచ్చింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా మబ్బులు కమ్ము కుని బోధన్‌, నిజామాబాద్‌ డివిజన్‌లలో సు మారు రెండుగంటలపాటు భారీ వర్షం కురిసింది. ఎడపల్లిలో అత్యధికంగా 72.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. మోస్రాలో 70, నవీపేటలో 54.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆర్మూర్‌ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదైంది. ఏదిఏమైనా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కురిసిన భారీ వాన రైతుల్లో ఆనందాన్ని నింపింది.

రుద్రూర్‌: పొతంగల్‌ మండలం టాక్లి గ్రా మంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి. భారీ వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడడంతో ప్రకాశ్‌రావ్‌కు చెందిన రెండు గేదె లు మృతి చెందాయి. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement