శభాష్‌ శ్రీనివాస్‌.. | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ శ్రీనివాస్‌..

Jun 29 2026 1:35 AM | Updated on Jun 29 2026 1:35 AM

మాక్లూర్‌ : మండలంలోని ధర్మోరా సర్పంచ్‌ పందిరి శ్రీనివాస్‌ తీసుకున్న నిర్ణయంతో 16 మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రస్తుతం 72 మందితో కళకళలాడుతోంది. ప్రైవేట్‌ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న తన కూతురు శ్రీహితను సర్పంచ్‌ పందిరి శ్రీనివాస్‌ ‘బడిబాట’లో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఆ తరువాత గ్రామస్తులకు అవగాహన కల్పించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించారు.

ఉపాధ్యాయులు సర్పంచ్‌ కృషిని అభినందించారు. ఒక దశలో మూతపడుతుందన్న పాఠశాల జీవం పోసుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement