నేడు ఇందూరు తిరుమలలో ఏరువాక పౌర్ణమి | - | Sakshi
Sakshi News home page

నేడు ఇందూరు తిరుమలలో ఏరువాక పౌర్ణమి

Jun 29 2026 1:35 AM | Updated on Jun 29 2026 1:35 AM

నేడు ఇందూరు తిరుమలలో ఏరువాక పౌర్ణమి లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కమ్మర్‌పల్లికి బెస్ట్‌ యాక్టివిటీ అవార్డు క్షత్రియ సమాజ్‌ నూతన అధ్యక్షుడిగా గటడి ఆనంద్‌

మోపాల్‌: మండలంలోని నర్సింగ్‌పల్లిలోగల ఇందూరు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రంలో సోమవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మా పల్లె చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రతినిధి నర్సింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం, అభిషేకం, అలంకరణ పూర్తి కాగానే జ్యేష్ఠ మాసంలో నిర్వహించే వరుణ యాగం ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఎద్దులు, నాగళ్లు, అన్ని వ్యవసాయ ఉపకరణాలను గౌరవించుకుని ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతినెల పౌర్ణమి రోజు గర్భిణులకు అందించే దివ్యౌషధాన్ని సాయంత్రం 6 నుంచి 8.30 గంటలలోపు అందిస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు, గర్భిణులు, భక్తులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నర్సింహారెడ్డి కోరారు.

కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కమ్మర్‌పల్లికి బెస్ట్‌ యాక్టివిటీస్‌ అవార్డు దక్కింది. క్లబ్‌ స్థాపించిన ఏడాదిలోనే పలు సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు బెస్ట్‌ యాక్టివిటీస్‌ అవార్డుతో పాటు బెస్ట్‌ సెక్రెటరీ అవార్డును సొంతం చేసుకున్నట్లు క్లబ్‌ అధ్యక్షుడు లుక్క గంగాధర్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన లయన్స్‌ క్లబ్‌ దిల్‌ సే కార్యక్రమంలో డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ అమర్‌నాథ్‌ చేతుల మీదుగా బెస్ట్‌ యాక్టివిటీస్‌ అవార్డుతో పాటు, బెస్ట్‌ సెక్రటరీ అవార్డును అందుకున్నారు. ఈకార్యక్రమంలో లుక గంగాధర్‌, తెడ్డు రమేష్‌, చింత ప్రదీప్‌, రేవతి గంగాధర్‌, లక్మ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ సోమవంశీయ సహస్రార్జున క్షత్రియ సమాజ్‌ నూతన అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది గటడి ఆనంద్‌ ఆదివారం ఎన్నికయ్యారు. పట్టణంలో ఎస్‌ఎస్‌కే సమాజ్‌ అధ్యక్ష పదవికి నిర్వహించిన ఎన్నికల్లో గటడి ఆనంద్‌ అధ్యక్షుడిగా, అలాగే కార్యదర్శిగా డీకే రాజేశ్‌ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులకు ఈ సందర్బంగా ఎస్‌ఎస్‌కే సమాజ్‌ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌కే సమాజ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement