డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని నికాల్‌పూర్ గ్రామంలో బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆదివారం కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ముగ్గురు బాధితులకు కలిపి రూ. 45 వేల చెక్కులను అందించారు. గ్రామ సర్పంచ్ అనితాసుమన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాపురావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు బట్టు సంజీవ్, మోతె సాయన్న, దశాగౌడ్ ఉన్నారు.
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ పట్టణంలో బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఐదుగురు బాధితులకు కలిపి రూ.1.55 లక్షల చెక్కులను అందించారు. కౌన్సిలర్లు మామరి సందీప్, అంజుమ్ అలీ, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు పర్స అనంతరావు, వాకా మహేష్, సాయిబాబా, భూషణ్, దినేష్, మహేష్, కిరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
రుద్రూర్: మండలంలోని రాణంపల్లి గ్రామానికి చెందిన గాండ్ల సాయిలుకు మంజూరైన రూ.60వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఆదివారం సర్పంచ్ కొండల్‌వాడీ శంకర్ అందజేశారు. రాయకూర్ విండో వైస్ చైర్మన్ తోట అరుణ్‌కుమార్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు తోట సంగయ్య, మాజీ ఎంపీటీసీ బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.


