మడులు తడపని బోర్లు | - | Sakshi
Sakshi News home page

మడులు తడపని బోర్లు

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

ఆర్మూర్‌: ‘నాకున్న పది ఎకరాల వ్యవసాయ భూమికి నాలుగు బోరుబావులున్నాయి. అయితే, బోరుబావులకు వర్షం తోడైతేనే పొలంలో నీరు నిలిచి నాట్లు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటి వరకు సరైన వర్షాలు లేకపోవడంతో కేవలం రెండు ఎకరాల్లోనే వరి సాగు చేసేందుకు సిద్ధమయ్యాను. మిగిలిన ఎనిమిది ఎకరాల్లో ఏం చేయాలో పాలుపోవడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మాక్లూర్‌ మండల కేంద్రానికి చెందిన రైతు కాపు సుధాకర్‌. వరి పండించేందుకు ఎక్కువ నీరు అవసరం. సరిపడా భూగర్భ జలాలు, విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో వరి పంట పండించే రైతులకు కష్టకాలం అని చెప్పొ చ్చు. తొలకరి కురవని కారణంగా సోయాబీన్‌ విత్తుకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. బోరు బావులపై ఆధారపడి మొక్కజొన్న విత్తుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మొక్కజొన్న కూడా చేతికి వచ్చే అవకాశం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంట కోసం తంటాలు..

కమ్మర్‌పల్లి : బాల్కొండ నియోజకవర్గ రైతాంగం బోరుబావులపై ఆధారపడ్డారు. బాల్కొండ, వేల్పూ ర్‌, భీమ్‌గల్‌, కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌ మండలాల్లో రై తులు ప్రధానంగా మొక్కజొన్న, పసుపు, సోయాబీ న్‌ పంటలను సాగు చేస్తున్నారు. వరి నారు దశలో ఉన్నది. తొలకరికే విత్తనాలు వేసుకున్నప్పటికీ వాటి ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతున్నప్పటికీ డ్రిప్‌ తో పంటలకు నీటిని అందిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement