ఆకాశం వైపు అన్నదాత చూపు | - | Sakshi
Sakshi News home page

ఆకాశం వైపు అన్నదాత చూపు

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, జక్రాన్‌పల్లి మండలాల్లో ప్రధానంగా వరి సాగు చేస్తారు. రెండో స్థానంలో మొక్కజొన్న పండిస్తారు. బో రు బావుల్లో తగినంత నీళ్లున్న రైతులు మాత్రం ట్రాక్టర్ల ద్వారా దమ్ము చేసి నా రుమడుల కోసం పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్‌లో 69,930 ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా నిర్ణయించగా, ప్రస్తుతం బోరుబావుల వద్ద 1,013 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. మొక్కజొన్న 221 ఎకరాలు, సోయా 184 ఎకరాలు, ఇతర పంటలు 1,418 ఎకరాల్లో వేశారు. జూలై చివరి వారం వరకు వర్షాలు కురవక పోతే పంటల సాగు ప్రశ్నార్థకంగా మారనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement