నిర్లక్ష్యం వద్దు.. నేడే పల్స్‌ పోలియో | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం వద్దు.. నేడే పల్స్‌ పోలియో

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 1,91,883

1,007 బూత్‌ల ద్వారా పంపిణీ

ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య, ఆరోగ్యశాఖ

పోలియో రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం ఆదివారం నుంచి మూడు రోజులపాటు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. – సుభాష్‌నగర్‌

జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 1,91,883 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 27 పీహెచ్‌సీలు, 10 యూపీహెచ్‌సీలు, 275 సబ్‌ సెంటర్లు ఉన్నాయి. చిన్నారులకు పోలియో చుక్క లు వేసేందుకు 1,007 బూత్‌లను సిద్ధం చేశారు. 241 పట్టణ ప్రాంతాల్లో, 766 గ్రామీణ ప్రాంతాల్లో, 37 ట్రాన్సిట్‌, 27 మొబైల్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు జరిగే పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో 101 మంది పర్యవేక్షణ అధికారులు, 4277 మంది బూత్‌ సభ్యులు, 428 మంది ఆరోగ్య కార్యకర్తలు, 1,112 ఆశా కార్యకర్తలు, 1,501 అంగన్‌వాడీ కార్యకర్తలు విధులు నిర్వర్తించనున్నారు. మొత్తం 2,11,100 పోలియో డోస్‌లను అందుబాటులో ఉంచారు.

ఉదయం 7 గంటల నుంచే..

వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం 28న ఉదయం 7 గంటల నుంచే పోలియో చుక్కలు వేసేందుకు సర్వం సిద్ధం చేసింది. 29, 30 తేదీల్లో తప్పిపోయిన వారి ఇంటింటికీ తిరిగి పోలి యో చుక్కలు వేస్తారు. ప్రధానంగా అటవీ ప్రాంతాలు, గిరిజన పల్లెలు, మారుమూల గ్రామా లు, ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్లు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement