అనుమతి లేకుండా ఉర్దూ భాష బోధన | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేకుండా ఉర్దూ భాష బోధన

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

తల్లిదండ్రుల ఆగ్రహం

పాఠశాలను సీజ్‌ చేయాలని

బీజేపీ నాయకుల డిమాండ్‌

పెర్కిట్‌: పెర్కిట్‌లోని భరత్‌చంద్ర పాఠశాలలో అనుమతులు లేకుండా ఉర్దూ బోధనతోపాటు ప్రార్థన సమయంలో నమాజ్‌ చేయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శనివారం వారు పాఠశాలను ముట్టడించి కరస్పాండెంట్‌ మల్లయ్యతో వాగ్వాదానికి దిగారు. స్కూల్‌ ఎదుట ఆందోళన చేపట్టి, వెంటనే పాఠశాలను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో తల్లిదండ్రుల ఆరోపణలు వాస్తంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. విచారణ నివేదికను ఉన్నాతాధికారులకు పంపించనున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. కరస్పాండెంట్‌ మల్లయ్యను, ప్రిన్సిపాల్‌ అమీర్‌ఖాన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మైనారిటీ విద్యార్థులను ఆకర్షించడానికే స్కూల్‌ యాజమాన్యం ఉర్దూ భాష బోధన ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement