నదీ తీరం.. ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

నదీ తీరం.. ఆగమాగం

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

బోధన్‌: బోధన్‌ నియోజకవర్గంలో ఈ ఏడాది ఖరీఫ్‌ పంటల సాగు ఆగమాగమైంది. బోధన్‌ అర్బన్‌, రూ రల్‌, సాలూర, ఎడపల్లి, రెంజల్‌, నవీపేట మండలాల్లో ప్రధానంగా వరి సాగు చేస్తారు. రెండోస్థానంలో సోయా ఉంటుంది. వర్షాభావ పరిస్థితితో ప్రస్తు తం బోరు బావుల వద్దనే స్వల్ప విస్తీర్ణంలో వరి నా ట్లు వేశారు. నియోజకవర్గంలో లక్షా 10 వేల ఎక రాల సాగు భూమి ఉండగా, 90 వేల ఎకరాల వరకు వరి సాగవుతుంది. ప్రస్తుతం బోరుబావుల వద్ద 15 వేల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేసినట్లు అంచనా. వాగులు, చెరువులు అడుగంటి పో యాయి. మంజీర, గోదావరి నదుల జలాధారంతో నిర్మించిన సాలూర, రెంజల్‌ మండలంలోని కందకుర్తి, తాడ్‌బిలోలి, నవీపేట మండలంలోని నందిగా మ, నిజాంపూర్‌, నాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు నదుల్లో నీళ్లు లేక వట్టిపోతున్నాయి. అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం కింద 53 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ లిఫ్ట్‌ పనిచేయడం లేదు. నిజాంసాగర్‌ నీటిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement