నిజామాబాద్ రూరల్: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే వీబీ జీ రామ్‌జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వెంటనే ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడారు. జూలై 1వ తేదీ నుంచి ఈచట్టాన్ని కేంద్రం అమలు చేయాలని చూస్తోందన్నారు. ఇందుకు దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేవేందర్ సింగ్, ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకటేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, ఏ రమేష్ బాబు , ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రాములు, ఏషాల గంగాధర్, ఐద్వా సంఘం జిల్లా అధ్యక్ష – కార్యదర్శులు ఏ అనిత, బి సుజాత, వృత్తి సంఘాల నాయకులు ఇడగొట్టి సాయిలు, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు సిర్పలింగం లు పాల్గొన్నారు.


