ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

రేషన్‌ బియ్యం పట్టివేత

జక్రాన్‌పల్లి : మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్‌ నిఖిల్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్‌ పాఠశాలను పీడీఎస్‌యూ నాయకులు సందర్శించి మాట్లాడారు. అనంతరం టీచర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఈవో, పాఠశాల ప్రధానోపా ధ్యాయుడు శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి సరిగా చదవకపోవడంతో టీచర్‌ బాగా చదవాలని మందలించి కొట్టాడని ఎంఈవో తెలిపారు.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని అహ్మద్‌పుర కాలనీలో శనివారం రాత్రి సీసీఎస్‌ పోలీసులు 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యంను పట్టుకున్నారు. కాలనీకి చెందిన సిరాజొద్దీన్‌ వద్ద రేషన్‌ బియ్యం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. రెండో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అతడి ని అప్పగించగా, కేసు నమోదు అయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement