సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు బాలసభలు | - | Sakshi
Sakshi News home page

సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు బాలసభలు

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

మోపాల్‌: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీయడానికి, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, సభా భయం పోగొట్టడానికి బాలసభలు ఎంతగానో దోహదపడతాయని సిర్‌పూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం వి సత్యనారాయణ తెలిపారు. శనివారం మండలంలోని సిర్‌పూర్‌ హైస్కూల్‌లో బాలసభను నిర్వహించారు. ఈసందర్భంగా సుమారు 50 మంది విద్యార్థులు పద్యాలు, కవితలు, పాటలతోపాటు కథలు చదవడం, కథలు చెప్పడం వంటి వాటిని వేదికపై నిర్భయంగా చెప్పారు. 9వ తరగతి విద్యార్థులు పి లతిక, ఆర్‌ ప్రణూష వ్యాఖ్యాతలుగా నిర్వహించిన బాలసభలో ఉపాధ్యాయులు మోహన్‌, గాయత్రి, స్పందన, అక్బర్‌ బాషా, డాక్టర్‌ హజారే శ్రీనివాస్‌, డాక్టర్‌ కాసర్ల నరేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement