పెర్కిట్(ఆర్మూర్): ప్రభుత్వం యూరియా యాప్‌ను తొలగించాలని ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ సొసైటీ ఎదుట రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యాప్‌తో యూరియా లభించక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వ్యవసాయం చేసుకునే రైతులకు సాంకేతిక పరిజ్ఞానం లేక పోవడం వల్ల యాప్‌లో బుక్ చేసుకోలేక పోతున్నామన్నారు. దీంతో ఖరీఫ్‌లో సాగు పనులు ఆలస్యమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ చైర్మన్ బంటు మహిపాల్ మాట్లాడుతూ రైతులందరికి యూరియా లభించేలా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.


