మోపాల్/నిజామాబాద్ రూరల్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నానని, తనను ఉద్యమకారుడిగా గుర్తించి ప్రభుత్వం తరపున లబ్ధి చేకూర్చాలని బోడ మహేందర్ కోరారు. ఈమేరకు శనివారం జిల్లాకు విచ్చేసిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను మండలంలోని ముదక్‌పల్లి గ్రామానికి చెందిన మహేందర్ కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు కోనేరుసాయికుమార్ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవించేందుకు ప్రభుత్వం కే కేశవరావు అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.


