తెయూ(డిచ్‌పల్లి): డ్రగ్స్ వల్ల యువత భవిష్య త్ నాశనమవుతుందని, ప్రతిఒక్కరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని తెలంగాణ యూనివర్సి టీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు అన్నా రు. తెయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–4 ఆధ్వర్యంలో శనివారం డ్రగ్స్ వ్య తిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కా ర్యక్రమానికి ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా హాజ రై, మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. ‘డ్రగ్స్ వద్దు–బతుకు ముద్దు’ అ నే నినాదంతో విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–4 ఆఫీసర్ నర్స య్య, వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నార్త్ త హసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న రాహుల్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ రికార్డుల (పహాణీల) లో అక్రమంగా మార్పులు చేయడం, రికార్డుల తారుమారు, విధి నిర్వహణలో అవకతవకల కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా పాలనాధికారి కఠిన చర్యలకు ఉపక్రమించారు. సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయడంతోపాటు, శాఖాపరమైన విచారణకు ఆదే శించారు. నిజామాబాద్ నార్త్ మండలం పరిధి లోని కంఠేశ్వర్ ప్రాంతంలో సర్వే నంబర్లు 291/ఏ, 291ఏఏ, 292లకు సంబంధించిన రె వెన్యూ రికార్డుల్లో టాంపరింగ్ జరిగినట్లు వచ్చి న ఆరోపణలపై కలెక్టర్ స్పందించి, ప్రాథమిక విచారణ జరిపించారు. టాంపరింగ్ వాస్తవమేనని విచారణలో వెల్లడవడంతోపాటు పలు ఆరోపణలు రావడంతో రాహుల్‌ను సస్పెండ్ చేశారు. అలాగే శాఖాపరమైన విచారణ అనంతరం సమగ్ర నివేదికను అనుసరిస్తూ తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు.
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని రాకాసీపే ట్ కాలనీలో రోడ్డు గుంతలమయం కావడంతో బీజేపీ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపా రు. సదరు రోడ్డులోని గుంతల్లో నిలిచిన నీటి లో శనివారం వారు నాట్లు వేస్తూ, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపి కి షన్, 11వ వార్డు కౌన్సిలర్ రేణుకా బాలరాజు మాట్లాడుతూ.. రాకాసీపేట్‌లోని అయ్యప్ప స్వామి కమాన్ నుంచి ఆటో స్టాండ్ వరకు గల రోడ్డు గుంతలమయంగా మారిందని, వర్షం నీ రు నిలిచి వాహనాల రాకాపోకలకు తీవ్ర ఇ బ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సమస్య ను అధికారులకు విన్నవించినా పరిష్కరించ డం లేదన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డుపై గుంతలు పూడ్చి ప్రజల ఇబ్బందులు తీర్చాలని లేనిపక్షంలో ఆందోళన చేస్తా మని హెచ్చరించారు. నాయకులు గుంత గంగాధర్, గొడుకు ధర్మపురి, పప్పుల వేణు, మా సిని వినోద్, ఽమిర్జాపూర్ అర్వింద్, పవన్ తదితరులు ఉన్నారు.
నవీపేట: మండలంలోని సిరన్‌పల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న పేకాట స్థావరంపై ఛీతా ఫోర్స్, నవీపేట పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో పేకాడుతున్న 8 మందిని పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.లక్షకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 5 ద్విచక్ర వాహనాలతోపాటు 8 మొబైల్ ఫోన్లను స్వాధీ నం చేసుకున్నారు.
సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామంలో చౌట్‌పల్లి సరితకు మంజూరైన రూ. 60 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును శనివారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు.ఎమ్మెల్యే భూపతిరెడ్డి చెక్కును మంజూరు చేయించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మామిడికింది నరేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రిక్క ముత్తెన్న, మాజీ ఎంపీటీసీ ముష్కిల్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


