మత్తు పదార్థాలకు బానిస కావొద్దు | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలకు బానిస కావొద్దు

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

నిజామాబాద్‌ లీగల్‌ : యువత మత్తుపదార్థాలకు బానిస కావొద్దని న్యాయసేవ సంస్థ డ్రగ్స్‌ కమిటీ సభ్యులు మాణిక్‌ రాజు తెలిపారు. శనివారం నిజామాబాద్‌ యాంటి డ్రగ్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ఓ ప్రయివేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన చైతన్య సదస్సులో న్యాయసేవ సంస్థ సభ్యులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పిల్లలు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన చాక్లెట్‌ లాంటి వాటిని తీసుకోవద్దని సూచించారు. . న్యాయసేవ సంస్థ చీఫ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ రాజ్‌ కుమార్‌ సుబేదార్‌, న్యాయసేవ సంస్థ సభ్యులు జగన్మోహన్‌ గౌడ్‌, హైకోర్టు న్యాయవాది సరళా మహేందర్‌ గౌడ్‌, పాఠశాల అధ్యాపకులు, విధ్యార్థులు, న్యాయసేవ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మిద్దాం

డిచ్‌పల్లి: డ్రగ్స్‌ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామ సర్పంచ్‌ పానుగంటి రూప అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ – 4 ఆధ్వర్యంలో శనివారం డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో డ్రగ్స్‌ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి వలంటీర్లు ఫ్లకార్డులు, బ్యానర్లు చేతబట్టి ‘డ్రగ్స్‌ వద్దు.. బతుకు ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ నర్సయ్య, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement