● ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
● నగరంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ రూరల్: నిజమైన ఉద్యమకారులను గుర్తించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ ప్రొ ఫెసర్ కోదండరాం అన్నారు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో శనివారం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమం నిజాయితీపరులతో జరిగిందన్నారు. 12 ఏళ్లలో తెలంగాణ ఉ ద్యమకారులు గుర్తింపునకు నోచుకోలేదని, వారి కు టుంబాలు దీనస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా ముందుకు వెళతామన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఎ లాంటి సూచనలు చేయాలో కమిటీ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల వివరా లు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేయనున్నామన్నారు. పార్టీలకతీతంగా ఉద్యమకారుల గుర్తింపు ఉంటుందన్నారు. కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అంతకుముందు కళాకారులు ఆటపాటలు, తెలంగాణ ఉద్యమ గేయాలతో ఆలరించారు. ఉర్దూ అకాడమి చైర్మన్ తా హెర్ బిన్ హందాన్, ప్రభాకర్, గైని గంగారాం, మా జీ జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు, సూరి, తెలంగాణ శంక ర్, పుల్గం మోహన్, కోనేరు సాయికుమార్, ఆదె ప్రవీణ్, ఉద్యమకారులు తదితరులున్నారు.


