● మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ
సుభాష్‌నగర్: సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్)తో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత పటిష్టవంతంగా అమలుకు అవకాశం ఉంటుందని బీజేపీ శాసనసభా పక్ష మాజీ నేత యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా నగరంలోని శ్రీనగర్ కాలనీలోగల తన నివాసానికి విచ్చేసిన ఎన్నికల సంఘం ప్రతినిధులకు తన వ్యక్తిగత, కుటుంబ ఓటు వివరాలను ఆయన అందజేశారు. బీఎల్‌ఓలు ఇచ్చిన ఎస్‌ఐఆర్ పత్రాన్ని పూర్తి వివరాలతో నమోదు చేసి అందించారు. ఈసందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు స్వామి యాదవ్ ఉన్నారు.
మోపాల్ మండలం కులాస్‌పూర్, కంజర్, మోపాల్, బోర్గాం(పి) గ్రామాల్లో పోలింగ్ బూత్ వారీగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని తహసీల్దార్ ఎన్ రేఖ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఓటరుకు ఈఎఫ్ ఫారం చేరాలని, ఒక్కో ఇంటికి మూడు, నాలుగు సార్లు వెళ్లాలని తహసీల్దార్ సూచించారు. సర్పంచులు జనార్దన్‌రెడ్డి, రాకేష్, రవికుమార్, జీపీవోలు దేవన్న, వేణుగోపాల్‌రావు, బీఎల్‌వోలు ఉన్నారు.
ఎస్‌ఆర్ ప్రక్రియను తనిఖీ చేసిన ఆర్డీవో
ఇందల్వాయి/జక్రాన్‌పల్లి : ఇందల్వాయి మండలం మల్లాపూర్, లోలం, ఎల్లారెడ్డిపల్లి, అన్సాన్‌పల్లి, జక్రాన్‌పల్లి మండలంలో పలు గ్రామాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని శనివారం ఆర్డీవో రాజేంద్రకుమార్ తనిఖీ చేశారు. సికింద్రాపూర్‌లో ఓటర్లకు ఫామ్స్ పంపిణీ చేశారు. తహసీల్దార్లు కిరణ్మయి, బాలయ్య రెవెన్యూ ఇస్పెక్టర్ ప్రవీణ్, లోలం సర్పంచ్ రామకృష్ణ గౌడ్, మల్లాపూర్ సర్పంచ్ మోహన్, అన్సాన్‌పల్లి సర్పంచ్ మౌనిక నిఖిల్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.


