● జూలై 2న కళాశాలల బంద్‌కు పిలుపు
● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
నిజామాబాద్ రూరల్: రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీ యింబర్స్‌మెంట్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చే స్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జూలై 2న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగా ణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేసింది బహుజన వ ర్గాలేనని, త్యాగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేస్తే ప్ర త్యే క రాష్ట్రం ఫలాలను అగ్రకులాలు అనుభవిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అగ్రకులాల అధిపత్యం నడుస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ జులై 2న కాలేజీల బంద్ చేపడుతామని, 15న వేలాదిమంది విద్యార్థులతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల సత్తాను ప్రభుత్వానికి చూ పిస్తామని వెల్లడించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, దర్శనం దేవేందర్, బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, కరిపే రవీందర్, కొయ్యడ శంకర్, శ్రీలత, బగ్గలి అజయ్, చంద్రకాంత్, సత్యప్రకాష్, చంద్రమోహన్, అపర్ణ, రేఖ, గంగాధర్, శ్రీనివాస్, జయ, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.


