ఖలీల్‌వాడి : జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో అ డ్మిషన్లు పూర్తిగా అయినట్లు ప్రిన్సిపాల్ రాంమోహ న్ రెడ్డి తెలిపారు. కళాశాలకు మంజూరైన 1860 సీ ట్లకు 1860 మంది విద్యార్థులు ఇప్పటికే ఆప్షన్ చేసుకొని కేటాయించబడ్డారని, శనివారం 350 మంది వి ద్యార్థులు కళాశాలలో ప్రవేశం పొందారని ప్రిన్సిపా ల్ తెలిపారు. జులై 4 వరకు అడ్మిషన్స్ జరుగుతాయని, ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తోపాటు, జిరాక్స్ కాపీ లు తీసుకొని రావాలని విద్యార్థులకు సూచించారు.
కోర్సుల వారీగా ఇలా..
బీ.ఏ. (తె.మీ)60, ఉర్దూ మీడియం 60, రెగ్యులర్ 300, రీస్ట్రక్చర్ పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్‌లో 60 మొ త్తం బీఏలో 480 విద్యార్థులు చేరారన్నారు. అలాగే ఉపాధి ఆధారిత(ఏఈడీపీ) కోర్సులు బీకాం విభాగంలో బీఎఫ్‌ఎస్‌ఐ –60, సైన్స్ విభాగంలో హెల్త్ కే ర్ మేనేజ్ మెంట్ 60, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్సు ల్లో 60, బీకాం సీఏ 180, ఫైనాన్స్ 60, టాక్సేషన్ 60, అనాలైటిక్స్ 60, బీసీఏ 60, బీబీఏ 60 మంది విద్యార్థులు చేరారన్నారు. బీఎస్సీ లైఫ్ సైన్స్‌లో 300, ఫిజికల్ సైన్స్ 360, ఆనర్స్ 60 మంది వి ద్యార్థులు ప్రవేశాలు పొందారన్నారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్ రంగరత్నం, అడ్మిషన్ కన్వీనర్లు రమేష్ గౌడ్, రామస్వామి, దండు స్వామి, వినయ్ కుమార్, రంజిత, ఉమాకిరణ్, జయ ప్రసాద్, నహీదా బేగం, రాజేశ్, రామక్రిష్ణ, కిరణ్ కుమార్ గౌడ్, అధ్యాపకులు షేక్ చాంద్, దీపక్, రాహుల్, రజిత, వెంకటేష్ గౌడ్, అనసూయ, ముత్తెన్న, చంద్రశేఖర్, వేణుగోపాల్, అనసూయ, తదితరులు పాల్గొన్నారు.


