ప్రజాపంథా నేత డీవీకేకు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

ప్రజాపంథా నేత డీవీకేకు ఘన నివాళి

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

బోధన్‌/ఆర్మూర్‌: సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా సి ద్ధాంతకర్త, అమరుడు డీవీ కృష్ణ 4 వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం బోధన్‌లోని హెడ్‌పోస్టాఫీస్‌ వద్ద పార్టీ నాయకులు, ప్రజాసంఘాల స భ్యులు డీవీకే చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. జిల్లాలో బీడీకార్మికులను సంఘటితం చేసి, వారి సమస్యల పరిష్కారం, హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించడంలో ఆయన కృషి చిరస్మరణీయమన్నారు. పార్టీ డివిజన్‌ సహాయ కార్యదర్శి బీ.మల్లేశ్‌, మండల కార్యదర్శి పడాల శంకర్‌, నాయకులు, సభ్యులు ఎండీ ఇర్షాద్‌, బొంతల సాయిలు, పోశెట్టి, దేవయ్య, లాలయ్య, గంగారాం, సాయిబాబా,శ్రీను, లక్ష్మణ్‌, నాగేశ్వర తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆర్మూర్‌లోని కు మార్‌ నారాయణ భవన్‌లో బీ.కృష్ణ నాలుగో వర్ధంతి సభను నిర్వహించారు. ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి బీ.దేవరాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్య క్రమంలో సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర సెక్రటేరియట్‌ సభ్యుడు వీ.ప్రభాకర్‌ ఎర్రజెండాను ఆవిష్కరించి, మాట్లాడారు. నివాళి అర్పించిన వారిలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ముత్తన్న, సీనియర్‌ జ ర్నలిస్టు కొంగర శ్రీనివాస్‌, డివిజన్‌ నాయకులు ఎస్‌.సురేష్‌, జీ.కిషన్‌, కే.రాజేశ్వర్‌, వీ.సత్తెవ్వ, బీ.కిషన్‌, ఎం.నరేందర్‌, యూ.రాజన్న, నడిపన్న, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement