ఆర్మూర్‌టౌన్/రుద్రూర్/బోధన్‌టౌన్: జిల్లాలో శుక్రవారం పలుచోట్ల మొహర్రం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆర్మూర్‌లో రాంమందిర్ పాఠశాల ఎదుట పీరీలను ఏర్పాటు చేశారు. పలు కాలనీల్లో పీరీల ఊరేగింపు నిర్వహించారు. గోల్ బంగ్లా ప్రాంతంలో బాజన్న దర్గాలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈకార్యక్రమంలో 29వ వార్డు కౌన్సిలర్ తిరుమల సుమన్, సూర్య సమాజ్ ఆరె కటిక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బోధన్‌లో శక్కర్‌నగర్ కాలనీలో, పాన్‌గల్లీ ప్రాంతాల్లో పీరీల ఊరేగింపు నిర్వహించారు. పీరీలకు స్వాగతం పలుకుతూ ప్ర త్యేక పూజలు నిర్వహించి మిఠాయిలు పంచి పెట్టా రు. అనంతరం సమీపంలోని చెరువులో పీరీలను నిమజ్జనం చేశారు. మొహర్రం పండుగ సత్యం, త్యాగం, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని మత గురువు మొహమ్మద్ అబ్దుల్ బారీ ఖాద్రి అన్నారు.రుద్రూర్ మండలం అక్బర్‌నగర్ గ్రామంలో మొహర్రం సందర్భంగా హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహమ్మద్ అబ్దుల్ హది ఖాద్రి, అహ్మద్ జబ్రతుల్లా ఖాద్రి, షేక్ మొహమ్మద్, పాషా, సత్తార్, షేక్ జావీద్, లతీఫ్, ఫహీం , ఇర్ఫాన్ పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్
బోధన్: ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామ అంగన్‌వాడీ కేంద్రానికి శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు మీటరు బిగించి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు.ఈ సందర్భంగా విద్యుత్ శాఖ నిజామాబాద్ ఏడీఈ తోట రాజశేఖర్ మాట్లాడుతూ ఎడపల్లి మండలంలోని 11 అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించి ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. తాజాగా పోచారం, ధర్మారం, వడ్డెపల్లి, బాపునగర్, నెహ్రునగర్, ఠాణాకలాన్, కుర్నాపల్లి గ్రామాల అంగన్‌వాడీ కేంద్రాలకు కనెక్షన్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. పోచారం గ్రామ సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్, ఉపసర్పంచ్ పూజిత, వార్డు సభ్యులు మమత, దండెం సాయిలు,వీడీసీ కోశాధికారి లక్ష్మినారాయణ,నవీన్, శంకర్, ప్రేమానంద్,గోపి, యశ్వంత్ పాల్గొన్నారు.
రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి
రెంజల్/రుద్రూర్/వర్ని: ప్రభుత్వం అందించే పె ట్టుబడి సాయం రైతు భరోసాకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని రెంజల్, కోటగిరి, రుద్రూ ర్, పోతంగల్, వర్ని మండల వ్యవసాయాధికారు లు సిద్ధిరామేశ్వర్, రాజు, సాయికృష్ణ, నిశిత రాజశేఖర్ తెలిపారు. 2025–26, 2026–27 సంవత్సరాలకు సంబంధించి ఇప్పటివరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోని వారు రైతువేదికల్లో ఆయా గ్రామాల ఏఈవోలకు ఈ నెల 30 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
రుద్రూర్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోటగిరి ఎస్సై శ్రీనివాస్ సూచించారు. పోతంగల్ మండలం కొడిచర్ల గ్రామంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మన ఉరు, మన భద్రత,మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడి, ప్రజలతో ప్రతిజ్ఞ చేశారు. సర్పంచ్ కవిత ఈర్వంత్ , ఏఎస్‌ఐ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.
పల్స్ పోలియో విజయవంతం చేయాలి
బోధన్‌టౌన్(బోధన్): డివిజన్ పరిధిలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో విజయవంతం చేయాలని జిల్లా ఉప వైద్యాఽధికారి విద్యా రణ్వాలక్కర్ శుక్రవారం తెలిపారు. డివిజన్‌లో 284 పల్స్ పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామని, 0–5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
ప్రజల రుణం తీర్చుకుంటా
రెంజల్(బోధన్): ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించిన గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానని నీలా సర్పంచ్ క్యాతం యోగేష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతు తనపై, తన ఆధ్వర్యంలో ని పాలకవర్గంపై తప్పుడు ఆరోపణలు చేస్తు గ్రా మాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. సస్పెన్షన్‌కు గురైన కార్యదర్శి సాయిలు అవి నీతి,అక్రమాలనుఅడ్డుకునేప్రయత్నం చేశానన్నారు.
ఉచిత వైద్య శిబిరం
నవీపేట: మండలంలోని నాగేపూర్ గ్రామంలో హోప్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచితంగా ఈసీజీ, రక్త పరీక్షలను నిర్వహించారు. నరాలు, ఎముకలు, కంటి, దంత, పిల్లల వైద్య నిపుణులు 207 మంది రోగులను పరీక్షించి, ఉచితంగా మందులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఆస్పత్రి వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సంక్షిప్తం


