– ఘనంగా ఉగాది వేడుకలు
– ప్రత్యేక పూజలు.. పంచాంగ శ్రవణాలు
కొంగొత్త ఆశలతో శ్రీ పరాభవ నామ సంవత్సరానికి జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. గురువారం ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ప్రధాన ఆలయాలు, కూడళ్లు, వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఉగాదిని పురస్కరించుకొని జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన కుస్తీ పోటీలు, జడకొప్పులాటలు అలరించాయి.


