నిజామాబాద్ రూరల్: అవినీతిపరులు, అక్రమాలు, అధర్మానికి పాల్పడే వారికి ఈ ఏడాది పరాభవం తప్పదని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. జిల్లా కేంద్రంలోని కిషన్‌గంజ్‌లో గల ఆర్యవైశ్య సంఘం (పట్టణ) ఆధ్వర్యంలో గురువారం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, మాట్లాడారు. పంచాంగ శ్రవణం వినడానికి దాదాపు 52 సంవత్సరాలుగా వైశ్య సంఘానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సనాతన ధర్మం ఆచార వ్యవహారాలు పాటించడంలో వైశ్యులు ముందుంటారని కొనియాడారు. కేవలం హిందూ సంస్కృతిని పాటించడమే కాకుండా అందరిని ఏకం చేయడంలో వైశ్యుల పాత్ర కీలకమన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం జనవరి 1 నూతన సంవత్సర కాదని, ఉగాదినే కొత్త సంవత్సరమని తెలిపారు. యువత పోకడలకు పోకుండా ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పంచాంగ శ్రవణం చేసిన వేద పండితులు బ్రహ్మశ్రీ వేలేటి గౌరీ శంకర్ శర్మ ను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ 18వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి రాము, 34 డివిజన్ కార్పొరేటర్ బంటు ప్రవీణ్ (పండు), ఆర్యవైశ్య సంఘం (పట్టణ) అధ్యక్షుడు ధన్‌పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, కోశాధికారి గాలి నాగరాజు గుప్తా, కన్వీనర్లు లాబిశెట్టి శ్రీనివాస్ గుప్తా, పార్శి మారుతి గుప్తా, సుధాకర్ గుప్తా, రాజా ప్రతాప్ గుప్తా, నేతి మోహన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో
ఉగాది వేడుకలు


