నిజామాబాద్ రూరల్: పీఆర్సీ అమలు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తపస్ ఇందూరు శాఖ సభ్యులు జిల్లా కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యేతో పలు అంశాల గురించి వివరించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వీటి పై ప్రస్తావించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్ల కిషన్‌రెడ్డి, మధుసూదన చారి, రాష్ట్ర సహాయ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బద్రినాథ్, కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.


