జక్రాన్‌పల్లి: మండలంలోని కేశ్‌పల్లి గ్రామంలో మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. గ్రామంలోని 250 గేదెలకు గాలికుంటు వ్యాఽధి నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పూదరి మమత, మండల పశువైద్యాధికారిణి అశ్రితరెడ్డి, గోపాల మిత్ర పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: నగరంలోని కసాబ్‌గల్లిలో నివాసం ఉండే చాకలి స్రవంతికి శ్రీలక్ష్మీ చేయూత సేవా సమితి సభ్యులు శనివారం రూ.11 వేలు ఆర్థికసాయాన్ని శనివారం అందజేశారు. పేద కుటుంబం కావడంతో స్రవంతి వివాహానికి ఈ నగదు అందించినట్లు సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు బంగారి శ్రీనివాస్, లక్ష్మణ్, శ్రీనివాస్, యాదగిరి, రవీందర్, పవన్‌కుమార్, సతీశ్, సురేశ్, గంగాధర్ పాల్గొన్నారు.


