నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని మాధవన్‌నగర్‌లో సీపీఐఎంఎల్ రాష్ట్ర నాయకుడు గంగుల నర్సయ్య రెండవ వర్ధంతిని ఏఐకేఎంకేఎస్ నాయకులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామండ్ల రవీందర్, బిందు, మానస, పల్లె మల్లేశ్, కత్తుల మారుతి, సత్యనారాయణ, గారబోయిన శంకర్, కొండ అనూషవ్వ, రజియా, పల్ల దుర్గయ్య, యాది మల్లన్న, భిక్షపతి, లక్ష్మణ్, అనిత, రుక్కవ్వ, మంజుల, సిద్ధవ్వ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: నగరంలోని నాందేవాడలో ఉన్న రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ కార్యాలయంలో ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త, కార్మిక వర్గ విమోచన కోసం పోరాడిన మహనీయుడు కార్ల్ మార్క్స్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆర్‌ఎస్‌పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ.. కార్ల్ మార్క్స్ సమాజంలో ఉన్న దోపిడీ వ్యవస్థలను శాసీ్త్రయంగా విశ్లేషించి కార్మికులు, రైతులు సమాన హక్కులతో జీవించే సమాజం కోసం మార్గదర్శక ఆలోచనలు అందించిన మహనీయుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పిట్ల నరేశ్, గోపాల్ సింగ్, ఠాగూర్, సునీల్, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చంద్రకాంత్ సత్తెమ్మ కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ శనివారం పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ ఇటీవల మృతి చెందారు. ఆమె మృతిపై జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు నారవోయిన శ్రీనివాస్, పోత్నూర్ సర్పంచ్ మహిపాల్, సొసైటీ మాజీ చైర్మన్ గంగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తోట రాజన్న, భూషణ్‌రెడ్డి, గడ్డల సురేందర్, అన్సర్, రమేశ్‌రెడ్డి, దాసు, తిర్మల్, గంగారెడ్డి, బొబ్బిలి రాజు, మోహన్‌రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి: మండలంలోని గన్యతండాలో బీఆర్‌ఎస్ కార్యకర్త అడవిరాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబాన్ని ధర్పల్లి మాజీ జడ్పీటీసీ సభ్యుడు, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా యువజన నాయకుడు బాజిరెడ్డి జగన్ శనివారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట సికింద్రాపూర్ సర్పంచ్ అప్పాల అరుణ్ కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు దీకొండ శ్రీనివాస్, తలారి సతీశ్, కుంచాల రాజు, చింత మహేశ్, ప్రశాంత్, రమణారెడ్డి తదితరులు ఉన్నారు.


