ధర్పల్లి: గ్రామపంచాయతీల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ధర్ప ల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం వీధి కుక్కల కు కుటుంబ నియంత్రణ (ఏబీసీ) వ్యాక్సినేషన్లను వెటర్నరీ సిబ్బంది వేశారు. ఈ ప్రక్రియను ఎంపీడీవో లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ధర్పల్లిలోని నర్సరీని పరిశీలించారు. వేసవికాలం నేపథ్యంలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందించాలన్నారు. జీపీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ధర్పల్లి: మండలంలోని దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సరోజినీ దేవి, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించి మొక్కలు ఎండిపోకుండా నీటిని అందించాలన్నారు. జీపీ కార్యదర్శి సాయికుమార్, వార్డు సభ్యులు ఉన్నారు.
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంకులను శుభ్రం చేశారు. గ్రామంలో ఉన్న నర్సరీని పరిశీలించారు. నర్సరీలో మొక్కలకు ఎండ తగలకుండా నెట్‌ను ఏర్పాటు చేశారు. అనుకున్న లక్ష్యం మేరకు మొక్కలను పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్‌కు సూచించారు. సర్పంచ్ లోక స్వప్న, ఉపసర్పంచ్ పురుషో త్తంరెడ్డి, జీపీ కార్యదర్శి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్‌పల్లి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజు ల కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని కేజీబీవీలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బాలికలకు రక్తపరీక్షలు, ఒత్తిడి నిర్వహణ, టోల్ ఫ్రీ నంబర్ 14416, సీపీఆర్‌పై శిక్షణ, హెచ్‌పీ వీ వ్యాక్సినేషన్, డైట్ న్యూట్రిషన్, థైరాయిడ్ పై అ వగాహన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. పీడియాట్రీషియన్ సందీప్ మాట్లాడుతూ.. బాలికలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. పరీక్షలంటే భయాన్ని వీడి ఒత్తిడి లే కుండా సరైన సమాధానాలు రాసి మంచి మార్కు లు సాధించాలన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ స్పె షల్ ఆఫీసర్ జీ సవిత, ఆర్‌బీఎస్‌కే వైద్యులు శివప్రసాద్, తహిమినా ఫాతిమా, వెంకటేశ్వర్లు, ఫార్మాసి స్టు మౌనిక, ఏఎన్‌ఎం సుమలత, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
దుబ్బాకలో మాట్లాడుతున్న సర్పంచ్, ఉపసర్పంచ్
ధర్పల్లిలో కుక్కలకు వ్యాక్సిన్ వేస్తున్న సిబ్బంది


