ఎన్నికల ప్రచారంలో సోషల్ ట్రెండ్!
● ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్లు ఉపయోగిస్తున్న అభ్యర్థులు
● ప్రచారంలో భాగంగా
ఓటర్లకు ఫోన్ కాల్స్
ఆర్మూర్: జిల్లాలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు యువ ఓటర్లను ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాలను ఎంచుకుంటున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్‌లలో హామీలు గుప్పిస్తూ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. తరచూ ఆన్‌లైన్‌లో ఉండే యువతను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ప్రచారం జాతీయ రాజకీయాల్లో ఉండగా, ప్రస్తుతం మున్సిపల్ స్థాయి ఎన్నికల్లో ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ బయోడేటాను మొదలుకొని పార్టీ కార్యక్రమాల్లో, ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్న ఫొటోలను సోషల్ నెట్‌వర్క్ సైట్లలో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తూ లైక్స్, షేరింగ్, కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇంటర్నెట్, సోషల్ మీడియాపై పెద్దగా అవగాహన లేని సీనియర్ సిటిజెన్స్ అయిన అభ్యర్థులు సైతం తమ కుటుంబంలో ఉన్న యువకుల సహకారంతో తమ అకౌంట్స్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సైతం స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగిస్తుండటంతో అభ్యర్థులు సోషల్ మీడియాను ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. ఎన్నికల ఖర్చును ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించాల్సి ఉండటంతో అభ్యర్థులు తమ ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ నామినేషన్ల పర్వానికి ముందు నుంచే ప్రచారం నిర్వహించే పనిలో పడ్డారు.
ఫోన్ కాల్.. మెసేజ్‌లతో..
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ విజయా న్ని మూట గట్టుకోవడానికి ఉన్న ఏ చిన్న అవకాశా న్ని వదులుకోవడం లేదు. కాల్ సెంటర్ల వారితో ఒ ప్పందాలు చేసుకొని తమ పట్టణ పరిధిలోని లబ్ధిదారులు,ఓటర్ల ఫోన్ నంబర్లను వారికి చేరవేస్తున్నా రు.మరి కొందరు అభ్యర్థులు తనకు ఓటు వేసి గెలి పించాలంటూ ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ వాయిస్ రికా ర్డు చేసి ఫోన్లు చేస్తూ ఆ వాయిస్ రికార్డును వినిపిస్తున్నారు.ఫోన్ చేసి వివరాలు చెపితే సెల్ ఫోన్ ఉపయోగించే మహిళలు,వృద్దులు, నిరక్ష్యరాస్యులకు సైతం సమాచారం చేరవేసే ఆస్కారం ఏర్పడుతోంది.ఇది గ్రహించిన అభ్యర్థులు సెల్ ఫోన్‌ల ద్వారా ఓటర్లకు ఫోన్లు చేపిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకొ నే పనిలో పడ్డారు.దీంతో సోషల్ మీడియాతో పా టు కొత్త పుంతలు తొక్కుతున్న ఎన్నికల ప్రచారంపై సెల్ ఫోన్లు ఉపయోగించే ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో సోషల్ ట్రెండ్!


