జిల్లా కుమ్మర ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ రూరల్: నగరంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో నిజామాబాద్ జిల్లా కుమ్మర(శాలివాహన) ఉద్యోగుల సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో పనిచేస్తున్న అన్నిశాఖల ఉ ద్యోగులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ మర్రిపల్లి భూపతి, జనరల్ సెక్రెటరిగా బీ నాగేశ్వరరావు, కోశాధికారి గా కే హన్మాండ్లు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎ ప్రమో ద్‌కుమార్, కో–ఆర్డినేటర్‌గా కే రాజు, లీగల్ అడ్వైజర్‌గా విజిగిరి గంగారాం, కనకం గంగాధర్, అంకమ్మరావు, మీడియా సెక్రెటరీలుగా కత్తి గంగాధర్, కార్యవర్గ సభ్యులుగా టీ గంగాధర్, అశోక్, జైపాల్, పోశెట్టి, వినయ్‌కుమార్, దత్తు, రమేశ్, సంతోష్, సురేశ్, మధు, లక్ష్మణ్, బాలయ్య ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా అసిస్టెంట్ ప్రొఫెసర్(రిటైర్డ్) వీరప్రసాద్, న్యాయవాది విజిగిరి గంగారాం వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సభ్యులు సన్మానించారు.


