అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య

Feb 9 2026 8:09 AM | Updated on Feb 9 2026 8:09 AM

అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. ఎస్సై పుష్పరాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నరాముల అశోక్‌(41) గత సంవత్సరం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా రు. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కావడం లేదు. దీంతో జీవితంపై విరక్తితో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భా ర్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కుటుంబ కలహాలతో తాపీ మేస్త్రి..

నిజాంసాగర్‌(జుక్కల్‌): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహమ్మద్‌నగర్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నిజాంసాగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బాలాఘట్‌ జిల్లా వాలేగావ్‌ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌(38) కొన్ని నెలల క్రితం మండల కేంద్రానికి వచ్చి తాపీ మేస్త్రి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. నాలుగు రోజులుగా మధ్యప్రదేశ్‌లో ఉంటున్న కుటుంబ సభ్యులతో తరచూ ఫోన్‌ మాట్లాడుతూ గొడవ పడేవాడు. అతిగా మద్యం సేవించేవాడు. ఆదివారం స్వగ్రామానికి వెళ్తున్నట్లు తోటివారితో చెప్పిన అతను ఇంటి బయట బట్టల బ్యాగు ఉండటాన్ని తోటి మేస్త్రిలు గమనించారు. వారు ఇంట్లో అతని కోసం వెతుకగా బాత్‌రూమ్‌లో ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. వెంటనే కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement