
పొర్లుతున్న చెరువులు
నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని పలు చెరువులు పొర్లుతున్నాయి. మొత్తం 1086 చెరువులకు గాను 410 చెరువులు నిండుకుండను తలపిస్తుండగా, 178 పొంగిపొర్లుతున్నాయి. 50శాతానికి పైగా చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరాయి. 251 చెరువులు 75శాతం నిండాయి. జిల్లాలో ఉన్న సగానికిపైగా చెరువులు నిండాయని ఇరిగేషన్ సీఈ మఽ దుసూదన్‌రావు తెలిపారు. రెండు చెరువులకు గండ్లు పడగా, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మా శాఖ ఉద్యోగులందరినీ అప్రమత్తం చేశామని, చెరువుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలను పంపించాలని ఆదేశించినట్లు తెలిపారు.