
ఉరిమిన మేఘం
● సిరికొండ మండలం తూంపల్లిలో
అత్యధికంగా 198.5 మి.మీ వర్షం
● తెగిన రెండు చెరువులు
● పలు గ్రామాల్లోకి చేరిన నీరు
సిరికొండ మండలం ముషీర్‌నగర్ రగ్రామంలో ప్రవహిస్తున్న వరద
వరుణుడి గర్జనకు ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. ఎటు చూసినా వరద నీరే కనిపించింది. ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో రెండు చెరువులు తెగిపోవడంతో పలు గ్రామాల్లోకి నీరు చేరింది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పలు చోట్ల నేషనల్ హైవే, తలమడ్ల ప్రాంతంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కాలనీలు చెరువులు, కుంటలను తలపించాయి. వరదలో చిక్కుకున్న పలువురిని రెస్క్యూటీములు, పోలీసులు కాపాడారు. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి కురిపించిన వరుణుడు విలయ తాండవం చేశాడు. ఇద్దరు మృత్యువాతపడగా.. వాగులో గల్లంతయిన మరొకరి ఆచూకీ లభించలేదు. కార్లు, ఇతర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లాలో 89,568 ఎకరాల్లో, నిజామాబాద్‌లో 12,413 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా రెండురోజులుగా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. సిరికొండ మండలం తూంపల్లిలో అత్యధికంగా 198.5 మిల్లీ మీటర్లు, ధర్పల్లి మండల కేంద్రంలో 181.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 180.9 మి.మీ. వర్షం కురిసింది. ధర్పల్లి మండలం హొన్నాజీపేట అట వీ ప్రాంతంలోని ముత్యాల చెరువు తెగిపోవడంతో బీర ప్ప తండా, నడిమితండా, లక్ష్మీ చెరువు తండా ల్లోని ఇళ్లలోకి వరద నీరు చే రింది. ప్రజలు భ యంతో ఇళ్ల పైకప్పుల పైకి చేరారు. ఇందల్వాయి మండలం రాంసాగర్ తండా చెరువు కట్ట తె గింది. గుట్టకింది తండా, దొ న్కల్ చెరువులు ప్రమాదకరంగా పొంగిపొర్లడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోధన్ డివిజన్‌లో మంజీర నది ఉధృతంగా ప్రవహించడంతో పంటలు నీట మునిగాయి. 12,413 ఎకరాల్లో వరి, సోయా పంట లు దెబ్బతిన్నాయి. శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. రూరల్ ని యోజకవర్గంలోని వరద ప్ర భావిత ప్రాంతాల్లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్యతో కలిసి ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటించారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో గుట్టపై నుంచి బండ రాయి పడడంతో ఓ ఇంటి గోడ ధ్వంసమైంది. ఇందల్వాయి మండలం గన్నారంలో విద్యుత్ సబ్‌స్టేషన్ జలమయమైంది. జాతీయ రహదారి 44పకి పలుచోట్ల భారీగా వరద నీరు చేరడంతో నిజామాబాద్–హైదరాబాద్ రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ నుంచి, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సినవారు మెట్‌పల్లి, కరీంనగర్ మీదుగా వె ళ్లాల్సి వస్తోంది. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల జాతీ య రహదారి కోతకు గురికావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బాల్కొండ మండలంలో 12 కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోయాయి. నిర్మల్ వైపు కార్లు, బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. లారీలు, ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్లకు రెవెన్యూ, పోలీసు అధికారులు ఆహారాన్ని, నీటిని అందిస్తున్నారు.
ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్, సీపీ
అతలాకుతలమైన జనజీవనం
వర్షాలతో ఇద్దరు మృతి,
మరొకరి గల్లంతు
ఉప్పొంగిన వాగులు..
కొట్టుకుపోయిన రోడ్లు
55 చెరువులకు గండ్లు
89,568 ఎకరాల్లో నీట
మునిగిన పంటలు

ఉరిమిన మేఘం

ఉరిమిన మేఘం