
నిలిచిన బస్సులు, రైళ్లు
● హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు
నిలిపివేత
● వివిధ రూట్లల్లో 300 సర్వీసులు రద్దు
ఖలీల్‌వాడి: భారీ వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లా లోని పలు చోట్ల రోడ్లు, తలమడ్ల వద్ద రైల్వే ట్రాక్ దె బ్బ తినడంతో బస్సులు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆ రు డిపోల నుంచి 584 బస్సులు ప్రతి రోజూ వివిధ రూట్లలో రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే భా రీ వర్షం కారణంగా జాతీయ రహదారి 44పై పలు చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో హైదరాబాద్‌కు బస్సు సర్వీసులను రద్దు చేశారు. అలాగే ఎ ల్లారెడ్డి, భీమ్‌గల్, వర్ని, చందూర్, సిరికొండ, ధరపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవహిస్తుండడం, రోడ్లు చెడిపోవడంతో ఆయా రూట్లలో మొ త్తం 284 బస్సులు నిలిచిపోయాయి. వరద ప్రభావం అంతగా లేని ప్రాంతాలకు 300 బస్సులను యథావిధిగా నడుపుతున్నట్లు ఆర్‌ఎం జ్యోత్స్న తెలిపారు.
రద్దయిన 20 రైళ్లు
వరద ప్రవాహానికి కామారెడ్డి జిల్లా తల్లమడ్ల వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో సికింద్రాబాద్ – నిజామాబాద్ మధ్య 20 రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే 10 రైళ్లతోపాటు 10 ప్రత్యేక రైళ్ల నిలిచిపోయాయి. గురువారం నిజామాబాద్‌కు చేరుకున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను ఆర్మూర్, కరీంనగర్ మీదుగా సికింద్రాబాద్‌కు మళ్లించినట్లు రైల్వే అధికారుల ద్వారా తెలిసింది.
రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు..
రైళ్ల రద్దు, రూట్ మళ్లింపు నేపథ్యంలో ప్రయాణికులకు సమాచారం అందించేందుకు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైళ్ల రాకపోకల సమాచారం కోసం నిజామాబాద్ – 97032 96714, కామారెడ్డి – 92810 35664, సికింద్రాబాద్ – 040 27786170, కాచిగూడ – 9063 18082 నంబర్లను సంప్రదించాలని ప్రయాణికులకు రైల్వేశాఖ సూచించింది.