
స్పాట్ కౌన్సెలింగ్‌కు ఏడు దరఖాస్తులు
● మరో రెండు రోజులు అవకాశం
● ఇంజినీరింగ్ విద్యార్థులు
సద్వినియోగం చేసుకోవాలి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు మంగళవారం నిర్వహించిన స్పాట్ కౌన్సెలింగ్‌కు ఏడుగురు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్ ఆరతి తెలిపారు. ఈ నెల 28, 29వ తేదీల్లో కూడా స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుందని ఈ అవకా శాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకో వాలని కోరారు. తెయూ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ కోర్సుల తరగతులు బోధించేందుకు సుధీర్ఘ అనుభవం కలిగిన రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారని పేర్కొన్నారు. ఈ నెల 29వరకు అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్స్ పొందిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని పేర్కొన్నారు.
రేపు డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల
● సెప్టెంబర్ 2న తుది జాబితా..
సుభాష్‌నగర్: గ్రామపంచాయతీ, వార్డుల వారీగా ఫొటో ఓటరు జాబితా డ్రాఫ్ట్ రోల్ ప బ్లికేషన్ ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా పంచాయతీ అధికారులను మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 29న గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లాస్థాయిలో, 30న మండల స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు. డ్రాఫ్ట్ ఓట రు జాబితాపై 28 నుంచి 30వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 31వ తేదీన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. సెప్టెంబర్ 2న అన్ని గ్రామపంచాయతీల్లో ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు.
జీజీహెచ్ మరమ్మతులకు రూ.2.76 కోట్లు
● మరుగుదొడ్లు, డ్రెయినేజీలు,
భవనం పనులు
● పాలియేటివ్ కేర్ సెంటర్ అభివృద్ధి
నిజామాబాద్‌నాగారం: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనం మరమ్మతుల కోసం ప్రభు త్వం రూ.2కోట్ల 76లక్షలు మంజూరు చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరుగుదొడ్లు, డ్రెయినేజీలు, తలుపులు, కిటికీలు, భవనం ముందు భాగంలో మరమ్మతులు చేపట్టడంతోపాటు పాలియే టివ్ కేర్ సెంటర్ అభివృద్ధి, ల్యాబ్ మరమ్మతులు, టీహబ్ విస్తరణ పనులు చేపడతామ ని పేర్కొన్నారు. నిధుల మంజూరుకు కలెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారం ఉందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.