
ఎకో ఫ్రెండ్లీ యూత్‌లు..
కమ్మర్‌పల్లి: మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన యూత్ అసోసియేషన్‌లు ఎకో ఫ్రెండ్లీ యూత్‌లుగా గుర్తింపు పొందాయి. చౌట్‌పల్లిలో శరత్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 13 ఏళ్లుగా, హసకొత్తూర్‌లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 8 సంవత్సరాలుగా మట్టితో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ పూజిస్తున్నారు. బషీరాబాద్‌లో పోచమ్మగల్లీ గణేశ్ మండలి ఆధ్వర్యంలో 10 ఏళ్లుగా మట్టితో తయారు చేసిన గణపతిని ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. కమ్మర్‌పల్లిలో ఈ ఏడాది నుంచి మట్టితో తయారు చేసిన గణనాథుడిని ప్రతిష్టించాలని ఓం పద్మశాలీ విజయ సంఘం తీర్మానించింది.