
పదేళ్లుగా మట్టి విగ్రహం తయారీ..
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని ఉమ్మెడ గ్రామానికి చెందిన బుచ్చ శ్రీధర్ పర్యావరణ పరిరక్షణలో తనవంతు బాధ్యతగా ఏడు అడుగుల మట్టి గణపతిని తయారు చేశాడు. అంతే కాకుండా 100 మట్టి గణపతులను తయారు చేసి గ్రామంలోని ఇంటింటికి పంపిణీ చేసి పర్యావరణ హితం కోసం ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. బజరంగీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల కోసం పదేళ్లుగా శ్రీధర్ మట్టి గణపతిని స్వయంగా తయారు చేసి ఇస్తున్నాడు. గణపతుల తయారీ కోసం రెండు నెలల సమయాన్ని కేటాయిస్తున్నాడు. అలాగే మండలంలోని కుద్వాన్‌పూర్‌లో ఫ్రెండ్స్ యూత్ ఆద్వర్యంలో గత 10 సంవత్సరాలుగా మట్టి గణపతిని ప్రతిిష్ఠిస్తూ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు.