
2 గంటలు..6 సెంటీమీటర్లు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వాన ఎనిమిది గంటల వరకు కురిసింది. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అత్యధికంగా రెండు గంటల్లో 6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ తెలిపారు. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రెయినేజీలు ఉప్పొంగాయి. జిల్లా కేంద్రంలోని సౌత్ మండల పరిధిలో 55.3 మి.మీ, నార్త్ మండలం 50.1 మి.మీ, ఇందల్వాయి 39.9 మి.మీ, మోపాల్ 33.0, జక్రాన్‌పల్లి 29.4, మాక్లూర్ 31.1, వేల్పూర్ 20.1, రెంజల్ 16.1, నవీపేట 15.3, పోతంగల్ 14.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
నగరంలో దంచికొట్టిన వాన
రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు