విడుదలకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

విడుదలకు సిద్ధం

Aug 7 2025 10:31 AM | Updated on Aug 7 2025 10:31 AM

విడుద

విడుదలకు సిద్ధం

నిజామాబాద్‌
ఎస్సారెస్పీ నీటి

అంతర పంటలు..

జిల్లా రైతులు ప్రధాన పంటలతోపాటు అంతర పంటలు సాగుచేస్తూ అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025

– 8లో u

శ్రీరాంసాగర్‌ జలాశయం

జయశంకర్‌ ఆశయ సాధనకు కృషి

కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయ సాధనకు కృషి చేద్దామని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ 91వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని కంఠేశ్వర్‌ చౌరస్తా వద్ద జయశంకర్‌ విగ్రహానికి కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌ త దితరులు పూలమాలలు వేసి నివాళులు ఆ ర్పించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడి న తరగతుల అభివద్ధి శాఖ సహాయ అధి కారి నర్సయ్య, రాష్ట్ర మహిళా కమిషన్‌ స భ్యులు సుదాం లక్ష్మి, బుస్స ఆంజనేయులు, బుస్సాపూర్‌ శంకర్‌, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు శ్రీనివాస్‌, ఎం.రాజేశ్వర్‌, హ న్మాండ్లు, చారి తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌పై సస్పెన్షన్‌ వేటు

ఉత్తర్వులు జారీ చేసిన కార్యదర్శి డాక్టర్‌ శ్రీదేవి

బోధన్‌ టౌన్‌(బోధన్‌): బోధన్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జాద వ్‌ కృష్ణను సస్పెండ్‌ చేస్తూ మున్సిపల్‌ పరిపాలన విభాగం ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్‌ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వి షయం చర్చనీయాంశంగా మారింది. జాద వ్‌ కృష్ణ గతంలో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో రెవెన్యూ ఆఫీసర్‌(ఆర్‌వో)గా పనిచే శారు. ఆ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం, అ ధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గు ర్తించిన ఉన్నతాధికారులు జాదవ్‌ కృష్ణపై సస్పెషన్‌ వేటు వేశారు.

పదోన్నతులు వాయిదా

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. పదోన్నతులకు సంబంధించి సీనియార్టీ జాబితాలో తప్పులను సవరించాలంటూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఈ నెల 11 వరకు పదోన్నతుల ప్రక్రియ నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లో తొలగించారు. ఇదిలా ఉండగా బుధవారం కొందరు ఉపాధ్యాయులు నాట్‌ విల్లింగ్‌ కోసం డీఈవో కార్యాలయానికి వచ్చారు. దీంతో తప్పనిసరిగా పదోన్నతులు తీసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టంచేశారు. అంతలోనే పదోన్నతుల ప్రక్రియ వాయిదా పడినట్లు తెలియడంతో టీచర్లు వెనక్కి మళ్లారు.

నేటి నుంచి కాకతీయ కాలువ ద్వారా జోన్‌–1కు..

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి ఆయకట్టుకు నీటి విడుదలను చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో గురువారం నుంచి కాలువల ద్వారా నీరు విడుదల కానుంది. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 40.5 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో కాకతీయ కాలువ ద్వారా జోన్‌–1 (ఎల్‌ఎండీ ఎగువ భాగాన డీ–54 వరకు) ఆయకట్టు, లక్ష్మి, సరస్వతి కాలువల ఆయకట్టుకు నీటి విడుదల చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ సగం మాత్రమే నిండగా, మరో మూడు నెలలపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చే అవకాశం ఉండటంతో నీటి విడుదల కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నీటి విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా 2.2 లక్షలు, లక్ష్మి కాలువ ద్వారా 50 వేలు, సరస్వతి కాలువ ద్వారా 35 వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్లు ప్రాజెక్ట్‌ ఈఈ చక్రపాణి తెలిపారు.

విద్యుదుత్పత్తికి రెడీ..

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద ఉన్న జల విద్యుదుత్పత్తి కేంద్రం విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు జెన్‌కో అఽధికారులు తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదలను ప్రారంభిస్తే నాలుగు టర్బాయిన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు.

కొనసాగుతున్న ఇన్‌ఫ్లో..

ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి 793 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, తాగునీటి అవసరాల కోసం 231, ఆవిరి రూపంలో 462 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్‌లో బుధవారం సాయంత్రానికి 1078.30(40.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.

లక్ష్మి కాలువ గేట్లు

విలీన ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది నియామకాలకు గతంలో ప్రతిపాదనలు

ముందుకు సాగని ప్రక్రియ

మెరుగైన సేవలందక ఇబ్బందులు పడుతున్న రోగులు

న్యూస్‌రీల్‌

లక్ష్మి గేట్లు లేచేనా..?

‘మహాలక్ష్మి’పై వదంతులు.. పోస్టాఫీసులో బారులు

పోస్టల్‌ బ్యాంక్‌ ఖాతా ఉంటేనే మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.2500 వస్తాయనే ప్రచారం జరగడంతో మహిళలు కొత్త ఖాతాల కోసం నగరంలోని పెద్ద పోస్టాఫీసుకు బుధవారం భారీగా తరలివచ్చారు. కౌంటర్‌ వద్ద తోపులాడుకుంటూ ఖాతాలు తీశారు. ఈ విషయమై పోస్టల్‌ అధికారులను సంప్రదించగా బయట ఎవరో వదంతులు చేయడంతో మహిళలు తరలివస్తున్నారని చెప్పారు. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నిజామాబాద్‌

లక్ష్మి, సరస్వతి కాలువల

ఆయకట్టుకు నీరు

లక్ష్మి కాలువ ఆయకట్టుకు గురువారం ఉదయం నీటి విడుదల చేపట్టనున్న నేపథ్యంలో కాలువ హెడ్‌రెగ్యులేటర్‌ గేట్లు లేచేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద గేట్లను గతంలో మాన్యువల్‌గా ఎత్తేవారు. లక్ష్మి కాలువ ఆధునికీకరణలో భాగంగా హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లను ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలోకి తీసుకువచ్చారు. అందులో భాగంగా ఎస్సారెస్పీ దిగువన నిర్మించిన సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా కోసం కేబుల్‌ వేశారు. కాగా, గతేడాది నుంచి విద్యుత్‌ సరఫరా కావడం లేదు. గత యాసంగి సీజన్‌లోనే గేట్లు ఎత్తడానికి నానా తంటాలు పడ్డారు. ప్రస్తుతం గేట్లు ఎత్తాలంటే మాన్యువల్‌ ఆపరేటింగ్‌ చేయాలి. అయినా కూడా గేట్లు లేస్తాయా? లేదా? అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండు నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి ఆయిల్‌, కాయిల్స్‌ను ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి సబ్‌స్టేషన్‌లో సైతం విద్యుత్‌ లేదు. కాగా, అధికారులు ఓఅండ్‌ఎం నిధులతో మరమ్మతులు చేపడతామని చెప్పి అది కూడా మరచిపోవడం గమనార్హం.

దిగువనే విద్యుత్‌్‌ సబ్‌స్టేషన్‌..

లక్ష్మికాలువ హెడ్‌రెగ్యులేటర్‌కు ఎదురుగా సుమారు 100 మీటర్ల దూరంలోనే ముప్కాల్‌ మండలం నల్లూర్‌ గ్రామంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఉంది. అక్కడి నుంచి విద్యుత్‌ సరఫరాకు కనెక్షన్‌ తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కేబుల్‌ ఖర్చు కూడా తక్కువగా అయ్యే అవకాశం ఉండడంతో అధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

టెండర్లు పూర్తయ్యాయి

లక్ష్మి కాలువపై ఉన్న లిఫ్టులకు ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసింది. వాటికి టెండర్లు పూర్తయ్యాయి. అందులో నుంచి నూతన విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ప్రతిపాదనలు చేస్తున్నాం. త్వరలోనే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తాం. – సురేశ్‌,

డిప్యూటీ ఈఈ, మైనర్‌ ఇరిగేషన్‌, బాల్కొండ

విడుదలకు సిద్ధం1
1/4

విడుదలకు సిద్ధం

విడుదలకు సిద్ధం2
2/4

విడుదలకు సిద్ధం

విడుదలకు సిద్ధం3
3/4

విడుదలకు సిద్ధం

విడుదలకు సిద్ధం4
4/4

విడుదలకు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement