
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేష్
17,291 ఇళ్లు మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవో లు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో ఎండీ గౌతమ్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల క్షేత్రస్థాయి పరిస్థితిని మండలాల వారీగా పవర్ పాయింట్ ప్ర జెంటేషన్ ద్వారా ఎండీకి వివరించారు. జిల్లా వ్యాప్తంగా 19,306 ఇళ్లను కేటాయించాలని లక్ష్యం కాగా, 17,291 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. వాటిలో 9,360 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని, 5,541 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతిలో ఉ న్నాయన్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష వరకు రుణం అందిస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2,637 మందికి రూ. 30.07 కోట్ల రుణాలు ఇప్పించామని వెల్లడించారు. ఇంటి నిర్మాణానికి సుముఖంగా లేని వారి నుంచి రాతపూర్వకంగా లేఖలు తీసుకుని, వారి స్థానంలో అర్హులైన వారికి మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేషుగ్గా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా యంత్రాంగం పనితీరును ప్రశంసించారు. ప్రత్యేకించి గడిచిన రెండు నెలల నుంచి ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా గణనీయ మైన వృద్ధి సాధించిందని, రెండో విడత ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్‌లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ పురోగతి సాధించారని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డితోపాటు సంబంధిత శాఖల అధికారులను అభినందించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ బుధవారం జిల్లాలోని ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి, డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఒత్తిళ్లకు తలొగ్గొద్దు..
అర్హులైన వారి పేర్లు ఇందిరమ్మ లబ్ధిదారుల జా బితా నుంచి రద్దు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ సూచించారు. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాకుండా నిశితంగా పరిశీలించాలని, ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గకూడదని స్పష్టం చేశారు. హౌసింగ్ అధికారులు తహసీల్దార్, ఎంపీడీవోలతో సమన్వయం చేసు కొని ఉచితంగా ఇసుక టోకెన్లు అందించాలని సూచించారు. కంకర, ఐరన్, సిమెంటు, ఇటుకలు ఇతర సామగ్రి నిర్ణీత ధరలకే అందించేలా మండల స్థాయి ధరల నియంత్రణ కమిటీ చర్య లు తీసు కోవాలన్నారు. మేసీ్త్రలు నిర్ధారిత రుసుమును మాత్రమే తీసుకునేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల ఆధార్ నంబర్‌కు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలోకి బిల్లు మొత్తం జమ అవుతుందని, వారం రోజుల్లో ఈ ప్రక్రియ అమల్లోకి రానుందని ఎండీ గౌతమ్ వెల్లడించారు. లబ్ధిదారుల వివరాలను ప్రధానమంత్రి ఆవాస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, జియో ట్యాగింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులై న వారికి కేటాయించేందుకు చర్యలు తీసుకో వాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని అభయ హస్తం కాలనీలో 4.32 ఎకరాల ప్రభుత్వ స్థలంలో జీ+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని యంత్రాంగానికి సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, హౌసింగ్ పీడీ పవన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ కితాబు
ఇందల్వాయి, డిచ్‌పల్లి మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేష్