
నిధులు లేక నిలిచిన నియామకాలు
మోర్తాడ్(బాల్కొండ): వైద్య విధాన పరిషత్‌లో వి లీనమైన సామాజిక ఆస్పత్రులలో వైద్య నిపుణులు, ఇతర వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ నిధుల కేటా యింపు లేక పెండింగ్‌లో పడింది. వైద్య ఆరోగ్య శా ఖ పరిధిలోనే కొనసాగిన సామాజిక ఆస్పత్రులను గత ప్రభుత్వం వైద్య విధాన పరిషత్‌లోకి విలీనం చేసింది. అనంతరం ప్రత్యేక నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మోర్తాడ్, ధర్పల్లి, డిచ్‌పల్లి, బాల్కొండ, నవీపేట్, వర్నిలలోని 30 పడకల ఆస్పత్రులు, ఆర్మూర్‌లోని వంద పడకల ఆస్పత్రి వైద్య విధాన పరిషత్‌లో విలీనం చేశారు. భీమ్‌గల్ ఆస్పత్రి నిర్మాణంలో ఉన్నందున ఇక్కడ పోస్టుల భర్తీకి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 30 పడకల ఆస్పత్రులలో 14 మంది చొప్పున వివిధ రకాల నైపుణ్యం గల వైద్యులు, 18 మంది చొప్పున వైద్య సిబ్బంది, వంద పడకల ఆస్పత్రిలో 48 మంది లెక్కన వైద్యులు, 73 మంది చొప్పున వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టాలని నిర్ధారించారు. జిల్లాలో అన్ని ఆస్పత్రులలో వైద్యులు, వైద్య సిబ్బంది కలిపి 313 పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేయాలని ప్రతిపాదించారు. నిధులు లేకుండా నియామకాలు చేపడితే వేతనాల చెల్లింపు ఎలా అనే సందేహంతో వైద్యు లు, సిబ్బంది పోస్టుల భర్తీని చేపట్టలేకపోయారు. వైద్య విధాన పరిషత్‌లో విలీనం చేసిన తరువాత పోస్టులను భర్తీ చేయకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ పరిఽధిలోని వైద్యులు, ఉద్యోగులతోనే వైద్య సేవలను నెట్టుకొస్తున్నారు. ఫలితంగా మెరుగైన వైద్య సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. వై ద్య విధాన పరిషత్‌కు నిధులను కేటాయిస్తే పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులపై దృష్టి సారించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
త్వరలోనే నియామకాలు
త్వరలోనే వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులలో నియామకాలు జరిగే అవకాశం ఉంది. పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బందిని, వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న కొంత మంది ఉద్యోగులతో వైద్య సేవలను అందిస్తున్నాం. రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ శ్రీనివాస్‌రావు,
వైద్య విధాన పరిషత్ జిల్లా అధికారి