
ఢిల్లీ మహాధర్నాలో కాంగ్రెస్ నేతలు
సుభాష్‌నగర్: విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 42శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిర్వహించిన మహాధర్నాకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి హాజరయ్యారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం తెలపాలని కోరుతూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అదే విధంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఢిల్లీలో నిర్వహించిన మహాధర్నాకు హాజరయ్యారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు.

ఢిల్లీ మహాధర్నాలో కాంగ్రెస్ నేతలు